సాధారణ, సహజ, సంతులిత: ఒలింపిక్ మారథాన్ చాంపియన్లకు శక్తినిచ్చే ఆహారం

1896 నుంచి ఒలింపిక్స్‌లో మారథాన్ పోటీలు జరుగుతున్నాయి. 42.2 కిలోమీటర్ల దూరాన్ని వేగంగా పరుగెత్తుతూ చేరుకోవడమనేది ఓర్పుతో కూడిన పని. ఈ క్రమంలో అథ్లెట్లకు చాలా శక్తి అవసరం. మరి, దీనికోసం ఎంత శక్తి కావాలి? అడ్వాన్స్‌డ్ స్పోర్ట్స్ సైన్స్, పోషకాహారాల కాలంలో మారథాన్ చాంపియన్లకు కావాల్సిన ఆహారం ఏమిటి. పురుషుల, మహిళల మారథాన్‌లో ప్రస్తుతం అత్యుత్తమ రికార్డులున్న ఇద్దరు అథ్లెట్లు ఎలీడ్ కిపొహోగె, బ్రిజిడ్ కోస్గీలు ఏం తింటున్నారో చూద్దాం. టోక్యో ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతున్న ఈ కెన్యా అథ్లెట్ల ఆహార అలవాట్లపై మేం ఓ కన్నేశాం.

ఈ స్టోరీని స్క్రోల్ చేస్తూ వెళ్లండి. హైలైట్ చేసిన కీవర్డ్స్‌పై క్లిక్ చేస్తే బ్రిజిడ్, ఎలీద్‌లు తీసుకునే ఎనర్జీ ఫుడ్స్, డ్రింక్స్ వివరాలు కనిపిస్తాయి.

1 కప్ టీ(3 చెమ్చాల పంచదారతో) = 90 కేలరీలు

మారథనా్ అనేది చెమట చిందే పోటీ. కాబట్టి కొన్ని పానీయాలతో ప్రారంభిద్దాం. ఇది కెన్యా కాబట్టి ఇక్కడ టీ చాలా సాధారణం. టీలో కొంచెం చక్కెర వేసుకోవడం వల్ల అథ్లెట్లకు ఆరంభ ఆటంకాల నుంచి బయటపడేందుకు శక్తి అందుతుంది.

చాలామందికి స్వీట్ ఇష్టం. వారి ఆహారంలోని కార్బొహైడ్రేట్లలో అయిదో వంతు చక్కెర నుంచే వస్తోందని ఒక అధ్యయనం చెబుతోంది.

కొందరు కెన్యా రన్నర్లు నీటి కంటే టీయే ఎక్కువగా తాగుతారట. 450 కిలో కేలరీల శక్తినిచ్చేలా 5 కప్‌ల టీతో ప్రారంభిద్దాం.

5 కప్‌ల టీ = 450 కిలో కేలరీలు

15 టీ స్పూన్‌ల చక్కెర అంటే ఎక్కువే కావొచ్చు. కానీ, ఇంకా శక్తి కావాలి.

అథ్లెట్లకు ఏదైనా సరైన ఆహారం ఇవ్వాల్సిన సమయం వచ్చింది.

ఉగాలి = 220 కిలో కేలరీలు

తూర్పు ఆఫ్రికా దేశాలలో ప్రధాన ఆహారం. మొక్కజొన్నతో తయారుచేసే దీన్ని జావలా వండుకుంటారు.

చూడటానికి ఇది మామూలుగా కనిపించొచ్చు. కానీ చాలా దూరం పరిగెత్తే కెన్యా రన్నర్ల శక్తికి ఇదే మూలం. వారు మొత్తం తీసుకునే కేలరీల్లో నాలుగో వంతు ఉగాలినే ఉంటుంది.

టోక్యోలో వీరి ఆహారపు అలవాట్లు కొద్దిగా మార్చుకోవాల్సి రావొచ్చు. ‘‘ఇతర దేశాల్లో కెన్యా తరహాలో ఉగాలి ఉండదు. బహుశా అక్కడ అన్నం, జావ, చికెన్ లేదా చేపలు తినాల్సి రావొచ్చు''అని బ్రిజిడ్ అన్నారు.

ఇప్పుడు మనం చెప్పుకున్న ఆహారం గురించే మాత్రమే మాట్లాడుకుందాం. ఇది ఒక కప్పు సరిపోదు. రెండు కప్పులు చూద్దాం.

రెండు కప్పుల ఉగాలి = 440 కిలో కేలరీలు

ఉగాాలి మంచిదే. కానీ శక్తి కోసం ఇతర ఆహారం కూడా తీసుకోవాలి.

కేవలం జావ ఒక్కటే తినలేం కదా. దానికితోపాటు ఇంకేం తీసుకోవచ్చో చూద్దాం.

ఒక కప్పు గో మాంసం = 190 కేలరీలు

మాంసంతో కచ్చితంగా ఉపయోగం ఉంటుంది. అయితే, అది మనకు అలవాటై ఉండాలి.

గోమాంసంతో ప్రోటీన్ అందుతుంది. కానీ కెన్యా రన్నర్లు ఎక్కువగా పాలు, బీన్స్ నుంచే ప్రోటీన్ తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు రెండూ కలిపి చూద్దాం.

2 కప్పుల పాలు = 320 కేలరీలు

చాయ్ య టంగవిజి అనేది తూర్పు ఆఫ్రికా ప్రాంతంలో చాలామంది ఇష్టంగా తినే పాలతో తయారు చేసిన స్వీట్. బ్లాక్ టీ ని బాగా వేడి నీటితో కలిపి

ఇలీడ్‌కు మరో వంటకం అంటే ఇష్టం : ‘‘ముర్సిక్‌.. దీన్ని పులియబెట్టిన పాలతో చేస్తారు. దీన్ని అథ్లెట్లు ఇష్టపడుతుంటారు. ఇది తీసుకుంటే జీర్ణం వేగంగా అవుతుంది''అని ఆయన వివరించారు.

ఒక కప్పు బీన్స్ = 120 కేలరీలు

ఒక కప్పు ఉడికించిన బీన్స్‌ను ఉగాలితోపాటు కలిపి తీసుకోవచ్చు. దీని వల్ల మరో 120 కేలరీలు అదనంగా వస్తాయి. అయితే, ఇప్పటికీ క్యాలరీల కొరత ఉంది. ఇక చిలగడ దుంపలు చూద్దాం.

కెన్యా రన్నర్లు అన్నం, చిలగడ దుంపలు, బ్రెడ్ కూడా తీసుకుంటారు. కావాల్సిన కేలరీల్లో నాలుగో వంతు, కార్బోహైడ్రోట్లలో మూడో వంతు వీటి నుంచే వస్తాయి. మైళ్ల దూరం పరిగెత్తే రన్నర్ల శక్తి కోసం వీటిని తీసుకోవడం తప్పనిసరి.

2 కప్పుల అన్నం, 1 కప్పు ఉడకబెట్టిన చిలగడ దుంపలు = 510 కేలరీలు

రెండు కప్పుల అన్నం, ఒక కప్పు ఉడకబెట్టిన చిలగడ దుంపలతో కేలరీలు ఎంతవరకు పెరుగుతాయో చూద్దాం.

మారథాన్‌లో పరిగెత్తే మహిళా అథ్లెట్లకు కావాల్సిన శక్తికి ఇవి తీసుకుంటే వస్తుందా?

బ్రిజిడ్ కోస్గీకి ఎన్ని కేలరీలు అవసరం!

2019 చికాగో మారథాన్ సమయంలో బ్రిజిడ్‌కు దాదాపు 1,666 కేలరీలు అవసరం అయ్యాయి.

అంటే, ఒక మహిళకు ఒర రోజులో ఖర్చయ్యే కేలరీల మొత్తాన్ని కేవలం 2 గంటల 14 నిమిషాల్లోనే బ్రిజిడ్ ఖర్చుచేశారు.

ఇప్పుడు ఎలీడ్ కిపొహోగె సంగతి చూస్తే. ఈయన శరీరం పెద్దది. బ్రిజిడ్ కంటే ఈయన వేగంగా పరిగెత్తుతారు. అంటే బ్రిజిడ్ కంటే ఎక్కువ శక్తి, కేలరీలు ఈయనకు అవసరం.

అందుకే పైన చెప్పిన ఆహారానికి కొన్ని గుడ్లు, క్యాబేజీ, ఆకుకూరలు కూడా కలుపుదాం.

2 ఉడకబెట్టిన గుడ్లు, ఒక కప్పు మనగు కూర, ఒక కప్పు సుకుమా ఆకు కూర, ఒక కప్పు ఉడకబెట్టిన క్యాబేజీ = 260 కేలరీలు

రెండు గుడ్లు, ఉడకబెట్టిన ఆకుకూరలు, కాయగూరలతో ఎలీడ్‌కు అదనంగా మరో 260 కేలరీలు వస్తున్నాయి.

ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, స్థానికంగా అందుబాటులో ఉండే పాలకూర లాంటి కూరను మసాలా దినుసులు వేసి తీసుకుంటున్నారు.

తూర్పు ఆఫ్రికాలో విరివిగా దొరుకుతుంది.

‘‘మేం కూరగాయలను సూపర్‌మార్కెట్ నుంచి కొనుగోలు చేయం. మేం వాటిని పండించుకుంటాం. ఇక్కడ నేలలు చాలా సారవంతంగా ఉంటాయి. పెద్దగా రసాయనాలు కూడా ఉపయోగించం''అని బీబీసీతో బ్రిజిడ్ చెప్పారు.

దాదాపుగా కాలరీలన్నీ పూర్తయినట్టే. అయితే కాస్త అల్పాహారాన్ని కూడా మనం జోడించాలి.

ఒక అరటిపండు = 100 కేలరీలు

అందరిలానే రన్నర్లకు కూడా అల్పాహారం కావాలి. అయితే, అది పళ్ల రూపంలో అయితే మేలు.

‘‘నేను ఎక్కువగా పళ్లనే ఆహారంగా తీసుకోవడానికి ఇష్టపడతాను''అని బ్రిజిడ్ చెప్పారు. ‘‘ఈ రోజు అరటిపండు, రేపు పుచ్చకాయ, ఆ తర్వాతి రోజు ఆరెంజ్, ఆ తర్వాత మామిడి అలా తీసుకుంటా.''

అయితే, తనకు కూల్‌డ్రింక్స్ కూడా ఇష్టమని ఆమె చెప్పారు.

అయితే, ఇప్పుడు ఆరోగ్యకర ఆహారాన్నే చూద్దాం. అరటి పండు చూద్దాం. దీంతో దాదాపు 100 కేలరీలు వస్తాయి.

ఎలీడ్ కిపొహోగె కేలరీల సంగతి చూద్దాం!

మనం మొత్తంగా 2,322 కేలరీలకు చేరుకున్నాం. 2018లొ ప్రపంచ రికార్డు నెలకొల్పేటప్పుడు ఎలీడ్ అన్ని కేలరీలు ఖర్చుపెట్టారు.

అంటే ఒక పురుషుడు రోజు మొత్తంలో ఖర్చుపెట్టే కాలరీలను ఆయన కేవలం 2 గంటల, ఒక నిమిషం, 39 సెకన్లలోనే ఖర్చుపెట్టారు.

రోజూ తనకు కావాల్సన కార్బ్స్, కేలరీలను .

ఫుడ్ ఫర్ థాట్

ఎలీడ్ కిపొహోగె, బ్రిజిడ్ కోస్గీ.. ఇద్దరూ టోక్యో 2020 ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్నారు.

ఇటీవల కాలంలో మారథాన్‌లో తూర్పు ఆఫ్రికా అథ్లెట్లు సంచలనం సృష్టిస్తున్నారు. ఆహారంతోపాటు వారి శరీర నిర్మాణం, పర్వత ప్రాంతాల్లో నివాసం లాంటి అంశాలు వారి విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

సంతులిత ఆహారమే కీలకమని ఎలీడ్ మాతో చెప్పారు. ‘‘అథ్లెట్ అంటే నిర్మాణ రంగ కూలీగా పనిచేయడమే. అన్ని పనులూ అక్కడ చేతులతో చేయాల్సి ఉంటుంది. అందుకే ఏం తింటున్నాం అనేది చాలా కీలకం. మన వేగం దానిపైనే ఆధారపడి ఉంటుంది.''

నేటి ప్రపంచంలో ఫుడ్ సైన్స్, ప్రత్యేక పోషక పదార్థాల చుట్టూ స్పోర్ట్స్ తిరుగుతున్నాయి. అయితే, మెరుగు వేగంతో పరిగెత్తే అథ్లెట్లు సాధారణ, సహజ, సంతులిత ఆహారాన్నే తీసుకుంటున్నారని మనం గుర్తుపెట్టుకోవాలి.

కప్పు టీ

కప్పు టీ కప్పు టీ కప్పు టీ కప్పు టీ కప్పు టీ

5 కప్‌ల టీ = 450 కిలో కేలరీలు

15 టీ స్పూన్‌ల చక్కెర అంటే ఎక్కువే కావొచ్చు. కానీ, ఇంకా శక్తి కావాలి.

అథ్లెట్లకు ఏదైనా సరైన ఆహారం ఇవ్వాల్సిన సమయం వచ్చింది.

ప్లేట్ ఉగాలి

ఉగాలి = 220 కిలో కేలరీలు

తూర్పు ఆఫ్రికా దేశాలలో ప్రధాన ఆహారం. మొక్కజొన్నతో తయారుచేసే దీన్ని జావలా వండుకుంటారు.

చూడటానికి ఇది మామూలుగా కనిపించొచ్చు. కానీ చాలా దూరం పరిగెత్తే కెన్యా రన్నర్ల శక్తికి ఇదే మూలం. వారు మొత్తం తీసుకునే కేలరీల్లో నాలుగో వంతు ఉగాలినే ఉంటుంది.

టోక్యోలో వీరి ఆహారపు అలవాట్లు కొద్దిగా మార్చుకోవాల్సి రావొచ్చు. ‘‘ఇతర దేశాల్లో కెన్యా తరహాలో ఉగాలి ఉండదు. బహుశా అక్కడ అన్నం, జావ, చికెన్ లేదా చేపలు తినాల్సి రావొచ్చు''అని బ్రిజిడ్ అన్నారు.

ఇప్పుడు మనం చెప్పుకున్న ఆహారం గురించే మాత్రమే మాట్లాడుకుందాం. ఇది ఒక కప్పు సరిపోదు. రెండు కప్పులు చూద్దాం.

ప్లేట్ ఉగాలి ప్లేట్ ఉగాలి

రెండు కప్పుల ఉగాలి = 440 కిలో కేలరీలు

ఉగాాలి మంచిదే. కానీ శక్తి కోసం ఇతర ఆహారం కూడా తీసుకోవాలి.

కేవలం జావ ఒక్కటే తినలేం కదా. దానికితోపాటు ఇంకేం తీసుకోవచ్చో చూద్దాం.

గో మాంసం

ఒక కప్పు గో మాంసం = 190 కేలరీలు

మాంసంతో కచ్చితంగా ఉపయోగం ఉంటుంది. అయితే, అది మనకు అలవాటై ఉండాలి.

గోమాంసంతో ప్రోటీన్ అందుతుంది. కానీ కెన్యా రన్నర్లు ఎక్కువగా పాలు, బీన్స్ నుంచే ప్రోటీన్ తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు రెండూ కలిపి చూద్దాం.

కప్పుతో పాలు

2 కప్పుల పాలు = 320 కేలరీలు

చాయ్ య టంగవిజి అనేది తూర్పు ఆఫ్రికా ప్రాంతంలో చాలామంది ఇష్టంగా తినే పాలతో తయారు చేసిన స్వీట్. బ్లాక్ టీ ని బాగా వేడి నీటితో కలిపి

ఇలీడ్‌కు మరో వంటకం అంటే ఇష్టం : ‘‘ముర్సిక్‌.. దీన్ని పులియబెట్టిన పాలతో చేస్తారు. దీన్ని అథ్లెట్లు ఇష్టపడుతుంటారు. ఇది తీసుకుంటే జీర్ణం వేగంగా అవుతుంది''అని ఆయన వివరించారు.

బీన్స్

ఒక కప్పు బీన్స్ = 120 కేలరీలు

ఒక కప్పు ఉడికించిన బీన్స్‌ను ఉగాలితోపాటు కలిపి తీసుకోవచ్చు. దీని వల్ల మరో 120 కేలరీలు అదనంగా వస్తాయి. అయితే, ఇప్పటికీ క్యాలరీల కొరత ఉంది. ఇక చిలగడ దుంపలు చూద్దాం.

కెన్యా రన్నర్లు అన్నం, చిలగడ దుంపలు, బ్రెడ్ కూడా తీసుకుంటారు. కావాల్సిన కేలరీల్లో నాలుగో వంతు, కార్బోహైడ్రోట్లలో మూడో వంతు వీటి నుంచే వస్తాయి. మైళ్ల దూరం పరిగెత్తే రన్నర్ల శక్తి కోసం వీటిని తీసుకోవడం తప్పనిసరి.

అన్నం అన్నం చిలగడ దుంపలు

2 కప్పుల అన్నం, 1 కప్పు ఉడకబెట్టిన చిలగడ దుంపలు = 510 కేలరీలు

రెండు కప్పుల అన్నం, ఒక కప్పు ఉడకబెట్టిన చిలగడ దుంపలతో కేలరీలు ఎంతవరకు పెరుగుతాయో చూద్దాం.

మారథాన్‌లో పరిగెత్తే మహిళా అథ్లెట్లకు కావాల్సిన శక్తికి ఇవి తీసుకుంటే వస్తుందా?

బ్రిజిడ్ కోస్గీ

బ్రిజిడ్ కోస్గీకి ఎన్ని కేలరీలు అవసరం!

2019 చికాగో మారథాన్ సమయంలో బ్రిజిడ్‌కు దాదాపు 1,666 కేలరీలు అవసరం అయ్యాయి.

అంటే, ఒక మహిళకు ఒర రోజులో ఖర్చయ్యే కేలరీల మొత్తాన్ని కేవలం 2 గంటల 14 నిమిషాల్లోనే బ్రిజిడ్ ఖర్చుచేశారు.

ఇప్పుడు ఎలీడ్ కిపొహోగె సంగతి చూస్తే. ఈయన శరీరం పెద్దది. బ్రిజిడ్ కంటే ఈయన వేగంగా పరిగెత్తుతారు. అంటే బ్రిజిడ్ కంటే ఎక్కువ శక్తి, కేలరీలు ఈయనకు అవసరం.

అందుకే పైన చెప్పిన ఆహారానికి కొన్ని గుడ్లు, క్యాబేజీ, ఆకుకూరలు కూడా కలుపుదాం.

ఉడగబెట్టిన గుడ్డు ఉడగబెట్టిన గుడ్డు మనగు కూర క్యాబేజీ

2 ఉడకబెట్టిన గుడ్లు, ఒక కప్పు మనగు కూర, ఒక కప్పు సుకుమా ఆకు కూర, ఒక కప్పు ఉడకబెట్టిన క్యాబేజీ = 260 కేలరీలు

రెండు గుడ్లు, ఉడకబెట్టిన ఆకుకూరలు, కాయగూరలతో ఎలీడ్‌కు అదనంగా మరో 260 కేలరీలు వస్తున్నాయి.

ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, స్థానికంగా అందుబాటులో ఉండే పాలకూర లాంటి కూరను మసాలా దినుసులు వేసి తీసుకుంటున్నారు.

తూర్పు ఆఫ్రికాలో విరివిగా దొరుకుతుంది.

‘‘మేం కూరగాయలను సూపర్‌మార్కెట్ నుంచి కొనుగోలు చేయం. మేం వాటిని పండించుకుంటాం. ఇక్కడ నేలలు చాలా సారవంతంగా ఉంటాయి. పెద్దగా రసాయనాలు కూడా ఉపయోగించం''అని బీబీసీతో బ్రిజిడ్ చెప్పారు.

దాదాపుగా కాలరీలన్నీ పూర్తయినట్టే. అయితే కాస్త అల్పాహారాన్ని కూడా మనం జోడించాలి.

అరటిపండు

ఒక అరటిపండు = 100 కేలరీలు

అందరిలానే రన్నర్లకు కూడా అల్పాహారం కావాలి. అయితే, అది పళ్ల రూపంలో అయితే మేలు.

‘‘నేను ఎక్కువగా పళ్లనే ఆహారంగా తీసుకోవడానికి ఇష్టపడతాను''అని బ్రిజిడ్ చెప్పారు. ‘‘ఈ రోజు అరటిపండు, రేపు పుచ్చకాయ, ఆ తర్వాతి రోజు ఆరెంజ్, ఆ తర్వాత మామిడి అలా తీసుకుంటా.''

అయితే, తనకు కూల్‌డ్రింక్స్ కూడా ఇష్టమని ఆమె చెప్పారు.

అయితే, ఇప్పుడు ఆరోగ్యకర ఆహారాన్నే చూద్దాం. అరటి పండు చూద్దాం. దీంతో దాదాపు 100 కేలరీలు వస్తాయి.

రోడ్‌పై రన్నింగ్ చేస్తున్న ఎలీడ్ కిపోహోగె, బ్రిజిడ్ కోస్గీ

ఎలీడ్ కిపొహోగె కేలరీల సంగతి చూద్దాం!

మనం మొత్తంగా 2,322 కేలరీలకు చేరుకున్నాం. 2018లొ ప్రపంచ రికార్డు నెలకొల్పేటప్పుడు ఎలీడ్ అన్ని కేలరీలు ఖర్చుపెట్టారు.

అంటే ఒక పురుషుడు రోజు మొత్తంలో ఖర్చుపెట్టే కాలరీలను ఆయన కేవలం 2 గంటల, ఒక నిమిషం, 39 సెకన్లలోనే ఖర్చుపెట్టారు.

రోజూ తనకు కావాల్సన కార్బ్స్, కేలరీలను .

అరటిపండు ఉడగబెట్టిన గుడ్డు ఉడగబెట్టిన గుడ్డు మనగు కూర క్యాబేజీ బీన్స్